కార్తీకమాసం సందర్భంగా వనభోజనాల ఏర్పాటుకి నేను కూడా రెడి అయ్యా! మధ్యే నేను నేర్చుకున్న వంటకంక్యారెట్ హల్వా.మరి దాని తయారీ విధానం చూద్దామా!
కావలసిన పదార్థాలు :
క్యారెట్లు‌.. పావు కేజీ
పంచదార.. 200 గ్రా.
నెయ్యి.. 150 గ్రా.
జీడిపప్పు.. 10
కిస్‌మిస్‌.. కావలసినన్ని
తయారీ విధానం :
ముందుగా ఒక స్టీల్‌ గిన్నెలో సగం నెయ్యి పోసి జీడిపప్పు, కిస్‌మిస్‌‌లు వేసి వేయించాలి. తరువాత తురిమి ఉంచిన క్యారెట్ కోరులో పంచదార పోసి సన్నని సెగమీద, గరిటకు చుట్టుకు వచ్చేంతవరకు ఉడకనివ్వాలి. దించబోయే ముందు దాంట్లో యాలకులు పొడి చేసి వెయ్యాలి.

ఒక పళ్ళానికి నెయ్యిరాసి ఈ మిశ్రమాన్ని పోసి అది ఆరిపోకముందే కావాల్సిన ఆకారంలో ముక్కలు కోసుకోవచ్చు. క్యారెట్ హల్వా తయారైనట్లే..!
గమనిక: ఇంటిలో ఉన్న సభ్యులను బట్టి
పదార్థాల కొలతలు మారుతూ ఉంటాయి.